Site icon NTV Telugu

Minister KTR : రాజగోపాల్ రెడ్డి తులం బంగారం ఇస్తారు తీసుకోండి.. ఓటు మాత్రం టీఆర్‌ఎస్‌కు వేయండి..

Minister Ktr Road Show

Minister Ktr Road Show

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, సీపీఐ, సీపీఎం రాష్ట్రకార్యదర్శులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి 3 సంవత్సరాలు కోవర్డ్ గా పనిచేసి, బేరాసారాలు చేసి 18 వేల కాంట్రాక్టు దక్కిన తర్వాత ఆత్మాభిమానాన్ని గుజరాత్ సేట్ ల వద్ద తాకట్టు పెట్టారు.. మునుగోడు ప్రజలు కోరుకున్న ఉపఎన్నిక కాదు ఇది…. ఇంటింటికి తాగు నీరు ఇచ్చిన నాయకుడు కేసీఆర్.. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.. మా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి… మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా.. ఆ బాధ్యత నాది… నీతీ అయోగ్ తెలంగాణా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినా… కేంద్రం విధులు మంజూరు చేయలేదు.. రాజగోపాల్ రెడ్డి తులం బంగారం ఇస్తారు తీసుకోండి.. ఓటు మాత్రం తెరాసా కు వేయండి.. గుజరాత్ గద్దలు ఇచ్చే డబ్బులు తీసుకోండి తప్పులేదు.. ఏం అభివృద్ధి చేశారని బీజేపి కీ ఓటు వేయాలి… చేనేత మీద పన్ను వేసిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేవారీకీ మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version