NTV Telugu Site icon

Kottu Satyanarayana : సీఎం సూచనల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేశాం

Kottu Satyanarayana

Kottu Satyanarayana

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గ మల్లేశ్వర స్వామి వారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. అయితే.. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శంచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయంల భక్తులతో కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా.. దసరా ఉత్సవాలను సైతం కన్నుల పండువగా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని, సీఎం సూచనల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. అందుకే దసరా ఉత్సవాలు విజయవంతమయ్యాయని, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా జరిపించామని ఆయన తెలిపారు.

 

ఉత్సవాలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు మంత్రి. ఈ ఏడాది తీసుకున్న నిర్ణయాలు…రాబోయే సంవత్సరాలకు మార్గదర్శకమని, రాష్ట్రాభివృద్ధి అమ్మ ఆశీర్వాదంపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు, సీఎంకు అమ్మ కరుణాకటాక్షాలుండాలని ప్రార్ధించానని, కాణిపాకంలో వివాదానికి కారణం ఇంఛార్జి ఈవో అని ఆయన వెల్లడించారు. అభిషేకం టిక్కెట్ ధర పెంపుపై అభిప్రాయ సేకరణకు నోటీసు విడుదల చేశారని, అతను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందిన ఆయన స్పష్టం చేశారు. అతన్ని విధుల నుంచి తప్పించామని, విచారణకు ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు.