Site icon NTV Telugu

Gurukul Inter Results: ఎస్సీ గురుకుల ఇంటర్ ఫస్టియర్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

Koppula Eshwar

Koppula Eshwar

సోషల్ వెల్ఫేర్ (ఎస్సీ )గురుకులాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో చేరేందుకు గాను (RJC CET-2022 ) నిర్వహించిన ఎంట్రెన్స్ ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు.మొత్తం 19వేల360సీట్లకు గాను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 60వేల173మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు.ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి కొప్పుల శనివారం రాత్రి కరీంనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీలో చేరాల్సి ఉంటుంది.కుల,ఆదాయ,బదిలీ,స్టడీ సర్టిఫికెట్స్ తో విద్యార్థులు సకాలంలో హాజరు కావలసి ఉంటుందని సొసైటీ జాయింట్ సెక్రటరీ శక్రు నాయక్ తెలిపారు.విద్యార్థులు మరిన్ని వివరాల కోసం www.tswre is.ac.in,www.tswrjc.cgg.gov.in వెబ్సైట్స్ ను పరిశీలించాల్సిందిగా ఆయన సూచించారు.

 

Exit mobile version