NTV Telugu Site icon

Minister Kondapalli Srinivas: పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు

Kondapalli Srinivas

Kondapalli Srinivas

Minister Kondapalli Srinivas: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడలో పర్యటించిన మంత్రి.. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక వేత్తల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: Water Society Polls: సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా

తారకరామ ప్రాజెక్టును పూర్తి చేసి పైడి భీమవరం పారిశ్రామిక వాడ పరిసరాల్లో నీటి అవసరాలు తీరుస్తామన్నారు. వ్యర్థ జలాల నిర్వహణ కోసం చిన్న పరిశ్రమలు ముందుకు రావాలని మంత్రి సూచించారు. కేంద్రం ఇచ్చే 70 శాతం గ్రాంట్స్‌తో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేకూడతామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పని చేసేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలిచ్చారు.

Show comments