Site icon NTV Telugu

Konda Surekha: ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు..

Konda

Konda

వరంగల్ లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ బొక్కల గడ్డలోని ఈద్గాలో అలాగే ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదన్నారు.

Read Also: Underwear : డ్రాయర్ ఉతక్కుండా మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారా.. మీరు డేంజర్లో పడ్డట్లే

ఇక, అల్లా దీవెనలతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య కోరారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచి పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్‌ పండుగ చాటి చెప్తుందని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఈద్గాల అభివృద్ధికి కృషి చేస్తానని వారు స్పష్టం చేశారు. ఇక, ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను కోరుకున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

Exit mobile version