NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఆలస్యం

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

తెలంగాణ శాసన మండలిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై కీలక విషయాలు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడుపోయిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత RRR ను పట్టాలెక్కించామని అన్నారు. ఇప్పటికే రీజినల్ రింగ్ ఉత్తరాభాగానికి సంబంధించి 7,100 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు.

Also Read:Hyderabad: సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులకు వల.. మహిళ అరెస్ట్

దక్షిణ భాగానికి సంబంధించి నితిన్ గడ్కరితో సమావేశమై రిక్వెస్ట్ చేయడం జరిగింది. నితిన్ గడ్కరి.. దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. ఇప్పటికే డిపిఆర్ తయారు చేసేందుకు ఏజెన్సీని ఎంపిక చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటికే ఒక లక్ష కార్ యూనిట్ గా ఉంది. రాబోయే రోజుల్లో మరింత ట్రాఫిక్ పెరిగి జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ అంతా నగరంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడమేనని అన్నారు. వచ్చే మూడు నెలల్లో దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని గడ్కరికి తెలియజేసామని చెప్పారు.

Also Read:Care Hospital: కేర్ హాస్పిటల్స్ సంచలనం.. కార్డియాక్ కేర్‌తో 68 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స!

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ ఏడుసార్లు నితిన్ గడ్కరీని కలిశాము. రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరాభాగానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఇప్పించి పనులు ప్రారంభించేలా చూస్తానని నితిన్ గడ్కర్ హామీ ఇచ్చారు. క్యాబినెట్ అప్రూవల్ పూర్తికాగానే పిలిచిన టెండర్లు ఓపెన్ చేసి నిర్మాణ సంస్థలు ఎంపిక చేస్తామన్నారు. మేం దూరదృష్టితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ హైదరాబాద్ ను విశ్వనగరంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. ORR వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, పివిఆర్ ఎక్స్ప్రెస్ హైవే వంటి ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయి.

Also Read:Sandal Wood : ఒకే ఒక్క సినిమాతో బిజీ స్టార్ గా మారిన యంగ్ హీరో

మేము ORR నిర్మించి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే.. 300 నుంచి 400 కోట్ల ఆదాయం సంపాదించే ORR ను గత ప్రభుత్వ పెద్దలు 30 సంవత్సరాలకు అమ్ముకున్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ.. మేము తెలంగాణ అభివృద్ధి చేయడాన్ని ప్రతిపక్షం స్వాగతించాల్సింది పోయి రాజకీయాలు చేయడం బాధాకరం. స్వర్గీయ జైపాల్ రెడ్డి.. గతంలో ఎంతో దూరదృష్టతో హైదరాబాద్ మెట్రో రైలు మంజూరు చేయించారు. పార్టీలకతీతంగా హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావలసిందిగా నా విజ్ఞప్తి. వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో హైదరాబాదు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Also Read:Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా

60 శాతం తెలంగాణను కవర్ చేసే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంది. గత ప్రభుత్వం లాగా మేము రోడ్లను అమ్మడం లేదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లు నిర్మిస్తున్నాం. వాళ్లు కాలేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిపోయి కూలేశ్వరం అయింది.. అలాంటి వారే ఇవాళ మూసి ప్రక్షాళన ప్రాజెక్టుకు అడ్డుపడటం బాధాకరం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మంజూరు చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనే విషయం చైర్మన్ తో సహా సభలో ఉన్న సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని వెల్లడించారు.