NTV Telugu Site icon

Kandula Durgesh: రుషికొండ పై టూరిజం మంత్రి కీలక వ్యాఖ్యలు..

Kandula Durgesh

Kandula Durgesh

రుషికొండ పై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండ కట్టడాలు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా మ్యూజియం ఏర్పాటు చేయలేమోనని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. పర్యటకులను ఆకర్షించడం కోసం నైట్ లైఫ్ సమయం పెంచామని చెప్పారు. 2025 నుంచి అమలులోకి రానున్న నూతన టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోంది.. నూతన విధానంలో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు.. ఒబరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటళ్లు నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.. రాజధాని అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం జరగనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Read Also: IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ తొలి టీ20.. ఇండియా ఫీల్డింగ్

అమరావతిలో రివర్ ఫ్రంట్‌లో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తామని అన్నారు. త్వరలోనే కాన్ క్లేవ్ నిర్వహిస్తాం.. పర్యావరణ హితమైన, అభివృద్ధి నమూనాగా కొత్త పాలసీ ఉంటుందని మంత్రి తెలిపారు. స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో టూరిజం మంత్రులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తిట్టడం కోసం సమయం వెచ్చించారు తప్పా.. నిర్మాణాత్మక కృషి చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం.. టెంపుల్ టూరిజం 90శాతం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుందని అన్నారు. జనవరిలో విశాఖ, కాకినాడ, బాపట్లలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Read Also: Heart Attack: కదులుతున్న బస్సులో డ్రైవర్ గుండెపోటుతో మృతి.. ప్రయాణికులు పరిస్థితి?

Show comments