NTV Telugu Site icon

Minister Jogi Ramesh: వచ్చే 20 ఏళ్ళ పాటు జగనే రాష్ట్రానికి సీఎం

Jogi Ramesh

Jogi Ramesh

టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ భవిష్యత్తుకే గ్యారెంటీ లేని వాళ్ళు ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు..
దీని కోసం విస్తృత స్థాయి సమావేశం అట.. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు లాంటి నాయకుడు ఉండడు.. నోట్లో వేలు పెడితే కొరకలేడట అని ఆయన మండిపడ్డారు. కానీ, పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడవగలడు.. అవినీతి చేయటంలో చంద్రబాబు సిద్ధ హస్తుడు.. చంద్రబాబు చేసింది వ్యాపారమే రాజకీయం కాదు.. లక్షల కోట్ల అవినీతి సొమ్మును దండుకున్నాడు అని మంత్రి జోగి రమేస్ అన్నారు.

Read Also: Trivikram: త్రివిక్రమ్ కొడుకు ను చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?

దమ్ముంటే మీ ఆస్తులపై సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అరెస్టు చేస్తే చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైనా మద్దతు ఇచ్చారా? అని ఆయన అడిగారు. చంద్రబాబు అందరి వాడు కాదు.. మా వాడు అని ఆ సామాజిక వర్గం వారే ముందుకు వచ్చారు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తుంటే పవన్ కళ్యాణ్ కు కడుపు మంట ఎందుకు.. పెత్తందారుకు పవన్ కళ్యాణ్ పాలేరు అని మంత్రి ఆరోపించారు. ఆయన పవన్ కళ్యాణ్ కాదు పావలా కళ్యాణ్ అంటూ జోగి రమేష్ మండిపడ్డారు.

Read Also: CM Jagan: స‌మాజ భ‌ద్రత‌ కోసం త‌న ప్రాణాన్ని సైతం త్యాగం చేసే వ్యక్తే పోలీస్‌

అధికారంలో ఉంటే చంద్రబాబు క్యాష్ పిటీషన్.. అవినీతిలో దొరికితే క్వాష్ పిటిషన్ అంటూ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. టీడీపీలో వాగిన వాళ్ళంతా ఎన్నికలు అయిన తర్వాత బెండకాయలు, దోసకాయలు కోసుకుంటూ కూర్చోవాల్సిందే.. వచ్చే 20 ఏళ్ళ పాటు జగనే రాష్ట్రానికి సీఎం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్ళు రాసి పెట్టుకోండి అని అన్నారు. ఇక, నారా భువనేశ్వరిపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ నీకు తగుదునమ్మా?.. తప్పదనే భువనేశ్వరి మాట్లాడుతున్నారు.. మనసులో నుంచి కాదు గొంతు లో నుండే భువనేశ్వరి మాటలు.. తన కన్న తండ్రి మరణానికి కారణం అయిన వ్యక్తి జైల్లో ఉంటే ఆమె ఎందుకు బాధ పడతారు అని మంత్రి జోగి రమేష్ అన్నారు.