కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.. పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నాడని దుయ్యబట్టారు. టీడీపీ ఎన్నారై వింగ్ మీటింగ్లో మాట్లాడిన వీడియో చూపిస్తూ.. మీరు పెత్తందారులు అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజలను వెధవలతో పోల్చడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలని వెధవలతో పోల్చడం వారి కుసంస్కారంకు అర్థం పడుతుందని.. ఇలాంటివారిని ఉరితీయాలని అన్నారు.
చదువుకుని అమెరికా వెళ్లి నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఉండేసరికి ఇంత కడుపు మంట ఎందుకని మంత్రి జోగి రమేష్ ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటూ.. ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే ఎందుకు మీకు ఈ కడుపు మంట అని మండిపడ్డారు. మీరు కులహంకారుల లేదా కులపెత్తందారుల అని ప్రశ్నించారు. ఇలాంటి వారు గ్రామాలలో చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని డబ్బుతో కొనాలని చూస్తున్నారని.. పేదవారిని ప్రలోభాలకు గురిచేయాలని చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ వీడియోలో మాట్లాడిన వారిపై సుమోటోగా కేసు స్వీకరించి శిక్షించాలని మంత్రి కోరారు. ఎన్నారైలు టీడీపీకి మద్దతు ఇస్తున్న వారందరూ చంద్రబాబును నమ్ముకుంటే నిట్టనిలువునా మునిగిపోతారని తెలిపారు. ఎన్టీరామారావు ఎంతో కష్టపడి పార్టీని నిర్మిస్తే.. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అదే పార్టీని లాక్కున్నాడని దుయ్యబట్టారు. అలాంటి వారికి మీరు మద్దతు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. మీరందరూ జగనన్న వెంట నడవాలి అని సూచించారు.
Vidadala Rajini : విడదల రజినికి అడుగడుగునా నీరాజనం..!
ఎన్నికలలో డబ్బు సంచులు వేసుకొని గ్రామాలలో ఓట్లు కొనేద్దాం అనుకుంటే కుదరదని.. తెలుగు ప్రజలు ఆత్మ అభిమానం ఉన్న వారిని మంత్రి జోగి రమేష్ తెలిపారు. ప్రజలు ఆత్మాభిమానంతో ఉన్నారు.. కాబట్టి 2019లో చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అదే ఆత్మ విశ్వాసంతో చంద్రబాబు నాయుడుని కుప్పంలో కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ గల్లంతు అవుతుందని చంద్రబాబు నాయుడు చాపాదిండు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడని హితవు పలికారు. ఎన్నారైలు కులాలను పెత్తందారులను ప్రోత్సహించవద్దని ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. ఎన్నారైలు గ్రామాలలో మంచి పనులు చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. చంద్రబాబు నాయుడుకి మీ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నించారు.
ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టంగా చెబుతుంది.. గ్రామాలలో ఎవరైనా ప్రలోభాలు పెడితే దొంగ ఓట్లు వేస్తే కేసులు పెట్టాలని.. అభిమానం ఉంటే టీడీపీకి ఓటు వేసుకోవాలని, అంతేకానీ ఇక్కడకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలి చంద్రబాబు నాయుడు సంకనాకాల టీడీపీని గెలిపించాలి అంటే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు. అగ్రకులాల్లో ఉన్న పేదవారు సైతం జగనన్న పథకాలు తీసుకుంటూ జగనన్నకు మద్దతు తెలుపుతున్నారన్నారు. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన గెలిచేది జగనన్నే అని తెలిపారు. వీడియోలో ప్రజలను వెదవలు అంటూ మాట్లాడిన అతనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని కట్టిన శిక్ష విధించాలని కోరారు. పెనమలూరు నియోజకవర్గంలో పోరంకి, పెనమలూరు కొన్ని ఏరియాలలో దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారన్నారు. అటువంటి దొంగ ఓట్లు వేస్తే వెంటనే అరెస్టు అవుతారని అన్నారు. ఎవరు అలా అరెస్టు అయిన తనకే బాధని.. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గెలిచేది జోగి రమేష్ అని మంత్రి తెలిపారు. పైన జగనన్న ముఖ్యమంత్రి, ఇక్కడ జోగి రమేష్ ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని తెలిపారు.