Site icon NTV Telugu

Jogi Ramesh: చంద్రబాబువి పిల్ల చేష్టలు, చిల్లర రాజకీయాలు

Jogi Ramesh On Babu

Jogi Ramesh On Babu

మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఏలూరు జిల్లా పోనంగి గ్రామంలో వైస్సార్సీపీ ప్రభుత్వం పేదలందరికి కట్టిస్తున్న ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పరిశీలించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఒక పెద్ద లేఔట్ గా ఈ ప్రాంతమంతా కూడా ఒక సిటీగా అవతరించబోతున్న పరిస్థితులు చూడబోతున్నాం అన్నారు.

జగనన్న లేఔట్ లో మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకుంటున్న పరిస్థితులు చూస్తున్నారు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో సెల్ఫీ వీడియో తీసి ఆ ఇల్లు నేనే కట్టాను అని సోషల్ మీడియాలో ట్విట్ చేసారు. దానికి దీటుగా మా జగన్మోహన్ పరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి చేసామో చూడాలని రీట్విట్ చేసాం.. దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. పిల్ల చేష్టలు, చిల్లర రాజకీయాలు చేయటం సరైన పద్ధతి కాదంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు లాంటి వారు ఎంత మంది అడ్డువచ్చినా ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు.

Read Also:Earthquake Jolts Fiji : ఫిజీలో 6.3 తీవ్రతతో భూకంపం

రాష్ట్రంలో ఉన్న పేదలందరికి ఇళ్ళు నిర్మిస్తూ సియం జగన్ అడుగు ముందుకు వేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు శిఖండిలా ఇళ్ల నిర్మాణాలకు అడ్డు పడుతున్నారని మంత్రి జోగిరమేష్ విమర్శించారు. ఏలూరులో పేదల గృహనిర్మాణాలపై సమీక్షించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెల్ఫీ పిచ్చి తో చంద్రబాబు పిల్ల చేష్టలతో ట్వీట్ లు చేస్తున్నారని, దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రంలోని కోటి 60 లక్షల ఇళ్ల వద్దకు రాగలరా అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు. రాష్ట్రమంతా కాకపోయినా, కుప్పంలోకి వచ్చినా మా అభివృద్ధి, సంక్షేమం ఏంటో చూపిస్తామని, అలాగే తెలంగాణా మంత్రి హరీష్ రావు వస్తే ఏపీ లో అభివృద్ధి ఏం జరిగిందో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాసిగా ఉంటూ విజిట్ వీసా మీద మాత్రమే ఆంధ్ర కు వస్తున్నాడని మంత్రి మండిపడ్డారు.

Read Also: Tadipatri Tyres Theft: మున్సిపాలిటీలో దొంగలు పడి.. ఏం ఎత్తుకెళ్ళారంటే?

Exit mobile version