Site icon NTV Telugu

Free Cylinders: ఏడాదికి 2 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. గుజరాత్‌ మంత్రి కీలక ప్రకటన

Gujarat

Gujarat

Free Cylinders: గుజరాత్‌ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏడాదికి 2 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జితు వాఘాని సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో పౌరులు, గృహిణులకు రూ.1,000 కోట్ల ఉపశమనం లభిస్తుందని వాఘాని ప్రకటించారు. ఏడాదిలో రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. గుజరాత్‌లో 38 లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం నిర్ణయించిన రూ.650 కోట్లతో గుజరాత్‌లోని ప్రతి ఇంటికి దాదాపు రూ.1,700 వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.

Complaints in WhatsApp: పోలీసుల అరుదైన రికార్డు.. ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే 3 వేల కేసులు ఛేదించారు..!

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)పై 10 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును కూడా మంత్రి సోమవారం ప్రకటించారు. సీఎన్‌జీలో 10 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే కిలోకు రూ.6-7 వరకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా పీఎన్‌జీపై కిలోకు రూ.5-5.50 వరకు ప్రయోజనం ఉండబోతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన చాలా పెద్దదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా కూడా భావిస్తోందన్నారు. ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. పూర్తి మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

Exit mobile version