NTV Telugu Site icon

Minister Harish Rao: ఏడాదికి రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే

Harish Rao

Harish Rao

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంధిలోని మ‌న్ననూరులో బీటీ రోడ్డు ప‌నుల‌కు ఆయన శంకుస్థాప‌న చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో పాటు.. నాగ‌ర్ క‌ర్నూల్ ఎమ్మెల్యే మ‌ర్రి జనార్థన్ రెడ్డి, ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also Read : Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?

అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గ‌తంలో క‌రెంటో కావాలంటే ఎంతో ఇబ్బంది వాళ్లం.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24 గంట‌ల నాణ్యమైన విద్యుత్ ను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుంద‌ని ఆయన చెప్పారు. రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల ద్వారా రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని హరీశ్ రావు అన్నారు.

Also Read : 26/11 Attack: పాక్ జైల్లో 26/11 దాడి నిందితుడైన హఫీజ్ సయీద్‌ సన్నిహితుడి మృతి

ఏడాదికి రెండు పంట‌లు పండించుకునే విధంగా సాగునీరు అందిస్తున్నామ‌న్నారు. పండిన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తుమన్నారు. ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఇక.. అచ్చంపేట పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించి.. 150 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీతో పాటు వివిధ అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు.

Show comments