NTV Telugu Site icon

Harish Rao: జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డాడు.. ఐదేళ్లలో ఒక్క ఊరు కూడా తిరగలేదు

Harish Rao

Harish Rao

సంగారెడ్డి జిల్లాలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చెట్టుకి పన్ను రద్దు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెల మామూళ్లు కట్టాలి.. కానీ కల్లు డిపోల వైపు కళ్ళెత్తి చూడకుండా చేసింది కేసీఆర్.. రాబోయే రోజుల్లో గీతా కార్మికులకు లునాలు ఇప్పిస్తాం.. జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డాడు.. ఓడిపోయినా చింతా ప్రభాకర్ జనాలతోనే ఉన్నాడు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి ఒక్క ఊరు కూడా తిరగలేదు.. పని చేసే వారిని దీవించండి.. 3 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం పెడుతున్నాం.. శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాము అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Read Also: Lal Salaam: డబ్బింగ్ కంప్లీట్ చేసిన వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్…

ఎక్సైజ్ అధికారులు గీత కార్మికుల మీద జూలుం చేసే వాళ్లు అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గౌడన్నలకు పూర్తిగా గౌరవం కల్పించాం.. గౌడన్నలకు ప్రస్తుతం వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టించాం.. వారికి లూనాలు ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన జగ్గారెడ్డి ఐదేళ్ల కాలంలో కనీసం ఒక్క గ్రామంలో కూడా ప్రజల సమస్యలను తెలుసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. గీత కార్మికులకు కేసీఆర్ నిరంతరం అండగా ఉన్నారు.. అలాంటి కేసీఆర్ కు గీత కార్మికులు మద్దుతుగా నిలిచి మరోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

Show comments