NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది..

Harish Rao

Harish Rao

ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పరోక్షంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు.. సమైఖ్య వాదులు, తెలంగాణ వ్యతిరేకులతో కాంగ్రెస్ జత కట్టింది.. వైఎస్ షర్మిల తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read Also: Seediri Appalaraju: ఏపీలో జనసేన త్వరలో కనుమరుగు.. జనసైనికులు ఒకసారి ఆలోచించాలి..

తెలంగాణలో తొమ్మిది ఏళ్లుగా కర్ఫ్యూ లేదు కరువు లేదు అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్మితే రిస్క్ కాదా?.. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ లు చేసుకుంటుంది అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుంది.. మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమే.. ఒక్క సారి, ఒక్క సారి అనుకుంటే ఆగం అయితరు.. కళ్ల ముందు ఉన్న అభివృద్ధి చూడండి.. మనసుతో కేసీఆర్ కు ఓటు వేయండి అని మంత్రి పిలుపునిచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకువస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.. ముదిరాజ్, గంగ పుత్రులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్ అని హరీశ్ రావు వెల్లడించారు. గాలి మాటలు నమ్మి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే మీ బతుకులు ఆగం అవుతాయని ఆయన తెలిపారు.