Site icon NTV Telugu

Minister Harish Rao : మంత్రి హరీష్ రావు తనయుడికి గ్రాడ్యుయేషన్ పట్టా

Harish Rao

Harish Rao

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారాయన. హారీశ్ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సీటీ స్నాతకోత్సవం అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్ లో జరిగింది.

Also Read : Off The Record: అమలాపురం వైసీపీలో కోల్డ్ వార్.. ఎంపీ, మంత్రి మధ్య గొడవ..!

ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వ్యక్తం చేశారు.

Also Read : Mouni Roy: అమ్మడు.. నీకు పెళ్లి అయ్యింది.. గుర్తుందా.. ఏంటీ అందాల ప్రదర్శన

మంత్రి హరీశ్ రావు తన ట్వీట్టర్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ లో మా అబ్బాయి అర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను.. ఇది అతనిలోని పట్టుదలకు.. మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శనం అని ఆయన రాసుకొచ్చారు. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు.. అచ్చూ.. ఈ అద్భుతమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు అంటూ తన కుమారుడిని ఉద్దేశించి క్యాప్షన్ రాసుకొచ్చారు.

Also Read : Billionaires: అత్యధిక బిలియనీర్లు కలిగిన టాప్-10 దేశాలు

మంత్రి హరీశ్ రావు కుమారుడు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోవడంతో పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోయాడు. దీంతో మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ కు సోషల్ మీడిమాలో వైరల్ గా మారింది. మంత్రి హరీశ్ రావు తనయుడు అర్చిష్మాన్ ను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Exit mobile version