NTV Telugu Site icon

Harish Rao : ఎప్పటికీ అమరుల త్యాగాలు గుర్తుంచుకునేలా స్మారక చిహ్నం

Harish Rao

Harish Rao

మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో అమరవీరుల స్థూపాన్ని మంత్రి హరీష్‌ రావు, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నడి బొడ్డున డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నామన్నారు. సెక్రటేరియట్ ని కూల గొడతామని ఓ ప్రతిపక్ష నాయకుడు అంటే… మరో ప్రతిపక్ష నాయకుడు పేల్చేస్తామనే ప్రతిపక్ష నేతలు తెలంగాణలో ఉండడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో కూడా జూన్ 2వ తేదీన అమరుల స్ఫూర్తి చిహ్నాన్ని కూడా ప్రారంభించి తెలంగాణ సమాజం ఎప్పటికీ అమరుల త్యాగాలు గుర్తుంచుకునేలా ఈ స్మారక చిహ్నం నిర్మిస్తున్నామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ.10 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.

Also Read : Bandi Sanjay : రాత్రి 1 గంట తర్వాతనే ధరణి పోర్టల్ తెరుచుకుంటుంది

ముంబాయి, దుబాయి బొగ్గుబాయి అనే తెలంగాణ బతుకులు.. ఇవాళ భూమికి బరువయ్యేంత పంట పండిస్తుందని, వరినాట్లు వేసేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి తెలంగాణలో వచ్చిందన్నారు. అంతేకాకుండా.. ‘ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వేస్తే మాకు కార్యకర్తలు దొరకకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. దీన్ని చుస్తే ఇవాళ తెలంగాణలో ప్రతిపక్షాల మానసిక పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుంది. పక్క రాష్ట్ర సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో అమలైతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వండి లేదంటే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు.’ అని మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

Also Read : Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే