Gummanur Jayaram and Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.. చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు.. అందుకోసమే ఐటీ నోటీసుల వ్యవహారంలో స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. ఇక, మరోసారి ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఐటీ నోటీసుల అంశాన్ని చిన్నదిగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, ఇది భవిష్యత్తులో చాలా పెద్ద విషయంగా భయటపడుతుందన్న ఆయన.. ఇప్పటికే చంద్రబాబుకి ప్రజలు శిక్ష వేసారు.. రానున్న రోజుల్లో దేవుడు కూడా చంద్రబాబుకు శిక్ష వేస్తాడు అని వ్యాఖ్యానించారు.
Read Also: Kushi: ఓవర్సీస్ లో సూపర్బ్ కలెక్షన్స్… మూడు రోజుల్లోనే 1.6 మిలియన్ డాలర్స్
మరోవైపు, తిరుమలలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుమ్మనూరు జయరాం.. అసలు చంద్రబాబుకి నోటీసులు కొత్త కాదని వ్యాఖ్యానించారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా చంద్రబాబుకి తెలుసు అంటూ సెటైర్లు వేశారు. అయితే, భవిష్యత్తులో చంద్రబాబు ఐటీ నోటీసుల నుంచి తప్పించుకోలేడు అని జోస్యం చెప్పారు మంత్రి గుమ్మనూరు జయరాం. కాగా, చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారం జాతీయ మీడియాలో వచ్చిన తర్వాత.. ఆయన్ని వరుసగా టార్గెట్ చేస్తూ వస్తుంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర మంత్రులతో పాటు వైసీపీ నేతలు చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు.