Site icon NTV Telugu

Gummadi Sandhya Rani: 1/70 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..

Gummadi Sandhyarani

Gummadi Sandhyarani

Gummadi Sandhya Rani: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్‌ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్‌ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి అన్నారు అయ్యన్న. అదే జరిగితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. అయితే, 1/70 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి..

Read Also: Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!

యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. గిరిజనులు ఆందోళన చెoదవద్దు అని విజ్ఞప్తి చేశారు.. దీనిపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విషప్రచారo చేస్తూ అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఎస్‌ జగన్‌ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నాడు.. అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని ఫైర్‌ అయ్యారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి గుమ్మడి సంధ్యారాణి..

Exit mobile version