NTV Telugu Site icon

Gudivada Amarnath : రెచ్చగొట్టేలా ఏ పనీ చేయద్దని మేం అంటున్నాం

Gudivada Amarnath

Gudivada Amarnath

అమరావతి మహా పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్ర రద్దు పిటిషన్ తో పాటు దాఖలైన అన్ని పిటిషన్లపై రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. సంఘీభావం తెలపడానికి వచ్చే వారికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సవరించమని ధర్మాసనాన్ని పిటిషన్ తరపున న్యాయవాదులు కోరారు. అయితే.. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది ధర్మాసనం. పాదయాత్రలో అనుమతించిన 600 మాత్రమే పాల్గొనాలని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో.. అయితే తాజాగా అమరావతి మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ.. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందని, 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరచారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని, రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని ఆయన వెల్లడించారు.

Also Read : Jahnvi Kapoor : ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను
ప్రజల ఆకాంక్షలను ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటామని, ప్రజల ఆలోచనా విధానం మేం చెప్పడానికి వచ్చామని ఆయన వెల్లడించారు. మేం కూడా అవసరం అయితే ఇంప్లీడ్ అవుతామని మా ప్రాంత నాయకులు వచ్చారని ఆయన తెలిపారు. పాదయాత్ర విరామ సమయంలో 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను బైపాస్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ప్రజలకు మేం సమాధానం చెప్పాలని, ప్రజా ప్రతినిధులుగా మా చేతనైన కంట్రోల్ మేం చేస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖలతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నామని, రెచ్చగొట్టేలా ఏ పనీ చేయద్దని మేం అంటున్నామని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకరణకు మద్దతు తెలిపి అమరావతి బాగుండాలి అంటే కాలు కింద పెట్టనీయకుండా పాదయాత్ర చేస్తున్న వారిని అరసవెల్లి వరకు తీసుకెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు.