NTV Telugu Site icon

Minister Amarnath: సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిది..

Minister Amarnath

Minister Amarnath

వైసీపీ ఎమ్మెల్యే సీట్ల మార్పు, షర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. షర్మిళ కాంగ్రెస్ లో చేరిక ఆమె వ్యక్తిగతం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చు.. కాంగ్రెస్ లో చేరినా, కేఏ పాల్ పార్టీలో చేరిన తమకేం సంబంధం లేదని తెలిపారు. సీటిస్తేనే పార్టీలో ఉంటాము అనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీదని మంత్రి చెప్పారు.

Read Also: Abhishek Nama: 4 ఇంటర్వ్యూలు హ్యాండిల్ చేయలేవు.. రూ. 45 కోట్లు సినిమా తీసావా.. ?

రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.. ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకరు, ఇద్దరు వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అనేది అమయకత్వమేనని మంత్రి తెలిపారు. ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమేనన్నారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మారాను తప్ప జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదని అన్నారు.

Read Also: Venky 75: వెంకీ 75 వేడుకల్లో మెరిసిన తారాలోకం.. ఎవరెవరు వచ్చారో, ఫోటోలు చూశారా?

మరోవైపు.. పవన్ కల్యాణ్ సీటు కూడా చంద్రబాబు డిసైట్ చేస్తారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. జనసేన భవిష్యత్ లోకేశ్ డిసైడ్ చేస్తున్నారని తెలిపారు. జనసేన గాలి పార్టీ కనుకే టీడీపీ జెండాలు మోస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ పదవి గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించడమే ఆ రెండు పార్టీల పరిస్థితికి నిదర్శనం అన్నారు. ఇదిలాఉంటే.. ఎన్నికల హామీకి కట్టుబడి పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ ను పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

Show comments