NTV Telugu Site icon

Gudivada Amarnath: వారి బాధ చూస్తుంటే జాలేస్తోంది..! మంత్రి అమర్నాథ్ సెటైర్లు

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: వారి బాధ చూస్తుంటే జాలి వేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక టీడీపీ, వారి మీడియా విషం కక్కుతోందని మండిపడ్డారు.. వారి బాధ చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు.. ఇక, ఈ నెల 22న బందరు పోర్టుకు శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించారు మంత్రి అమర్నాథ్.. రాష్ట్రంలో లక్షా 30 వేల మందికి సచివాలయాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిదని ప్రశంసలు కురిపించారు.. ఎమ్ఎస్ఎమ్ ఈ సెక్టార్ లో 12 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు గత నాలుగేళ్లల్లో లభించాయని వెల్లడించారు.. ఎలక్ట్రానిక్, ఐటీ సెక్టార్ లో చంద్రబాబు హయాంలో వెయ్యి కోట్లు పెట్టుబడులు వస్తే మా నాలుగేళ్ల కాలంలో ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

Read Also: Food Delivery Platform: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలోకి కొత్త సంస్థ.. ఇక, స్విగ్గీ, జొమాటోకు చుక్కలే..!

కాగా, చెప్పిన పని చేశాకే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను. పని చేయకపోతే మీరు నాకు ఓటేయకండి.. అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మండలం మూలపేట గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు.. గడపగడపకు వెళ్లే సమయంలో ఒక వీధిలో తాము చాలాకాలంగా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో తాము చాలాసార్లు ప్రజా ప్రతినిధులకు చెప్పామని, అయినా ఇప్పటికీ తాము రోడ్లకు నోచుకోలేకపోతున్నామని వారు వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి అమర్నాథ్ ఈ ప్రాంతానికి తాను రోడ్లు వేయిస్తానని, రోడ్లు వేసిన తరువాతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని, ఒకవేళ రోడ్లు వేయలేకపోతే తాను మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగనని వ్యాఖ్యానించిన విషయం విదితమే.