NTV Telugu Site icon

Minister Gudivada Amarnath: పవన్‌పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. వెంట్రుక కూడా పీకలేకపోయారు..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Minister Gudivada Amarnath: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విసన్నపేట భూములను పరిశీలించిన పవన్‌.. వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చిన ఆయన.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. పవన్ కల్యాణ్‌ విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారు అంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. రుషికొండ పేలిపోయి జగన్మోహన్ రెడ్డి అందులో కూరుకుపోవాలనే పవన్ వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవి అంటూ దుయ్యబట్టారు.. రుషికొండలో ఎటువంటి ఉల్లంఘణలు కనిపించక వెనక్కి తిరిగొచ్చారన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్ వంటి రియల్ లైఫ్ హీరోను చూసి.. ఈర్ష్య ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలి..? అని ప్రశ్నించారు. ప్రజానాయకుడైన జగన్ స్థాయిలో కథా నాయకుడైన పవన్ ను ఒకే స్థాయిలో జనం చూస్తారు అనుకుంటే అమాయకత్వమే అవుతుందంటూ సెటైర్లు వేశారు.

Read Also: Droupadi Murmu: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కీలక సందేశం

ఇక, పవన్‌ కల్యాణ్‌ కీచక గురువుగా మారాడు అంటూ ఫైర్‌ అయ్యారు గుడివాడ అమర్నాథ్.. యువకులను సినిమా అనే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి విచ్చలవిడిగా వాడుకుంటున్నారన్న ఆయన.. నాయకులు, కార్యకర్తలను మూట కట్టేసి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ సిద్ధం అయ్యారని విమర్శించారు. నాపై, మా ప్రభుత్వం మీద దోపిడీ దారులు అనే ముద్ర వేసేందుకు పవన్ కల్యాణ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటూ తిప్పికొట్టారు. తరతరాలుగా రాజకీయాల్లో ఎదిగిన వాళ్లం.. మేం ప్రజలకు, ప్రభుత్వానికి కస్టడీయన్ గా వ్యవహరిస్తోందన్నారు. విశాఖ భూ అక్రమాలపై త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు ఉంటాయని ప్రకటించారు. సిట్ నివేదిక ఆధారంగా సుమారు 76 మంది ప్రమేయం నిర్ధారణ అయ్యింది. వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 2014-19మధ్య రాష్ట్రంలో కొండలను దోపిడీ చేసిన అనకొండలు ఇప్పుడు ఎందుకు కొండల గురించి మాట్లాడుతున్నారు..? అంటూ నిలదీశారు. బెజవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం బయటపడితే పవన్ కల్యాణ్‌ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా..? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు.. వైసీపీలో తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరవు అనుకున్నవాళ్లే జనసేనలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.