Site icon NTV Telugu

Gottipati Ravi Kumar: విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఫైర్..!

Gottipati Ravi

Gottipati Ravi

Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేసంలో భాగంగా అయన రాష్ట్రంలోని వివిధ అంశాలపై మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడిన అందరికీ శిక్ష పడుతుందని హెచ్చరించారు. మద్యం కేసులో చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు.

Jaganmohan Rao: దొడ్డిదారిన గెలిచిన జగన్మోహన్‌ రావు.. సీఐడీ విచారణలో వెలుగులోకి సంచలనాలు!

వీటితోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం ద్వారా పదివేల కోట్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు కావలసిన వస్తువులన్నీ మంచి క్వాలిటీతో ఇచ్చామని, రాజకీయ నాయకుల ఫోటోలు వేయకుండా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించమని గతంలో చెప్పామని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని, ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మంది పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని ఆయన గుర్తు చేశారు.

Anitha Vangalapudi: ఒక్క ఛాన్స్ అన్న పాపానికి 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది.. హోం మంత్రి హాట్ కామెంట్స్..!

Exit mobile version