NTV Telugu Site icon

టీఆర్ఎస్ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండేవాడు : గంగుల కమలాకర్

జమ్మికుంట ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండేవాడు అని అన్నారు. కళ్యాణలక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు  పథకాల గురించి పరిగి అంటూ అవహేళన చేసి మాట్లాడాడు ఈటెల. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గౌరవించింది. 20 సంవత్సరాలుగా అనేక పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్నాడు. తెరాసా పార్టీని చీల్చే కుట్రపన్నారు. పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థే ముఖ్యము. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి విశేష ఆదరణ ఉంది.  కెసిఆర్ బొమ్మ మీద గెలిచి పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం ఆయనకే చెల్లింది అన్నారు. తెలంగాణ వ్యతిరేకులైన బిజెపి కాంగ్రెస్ వారితో అప్పట్లో చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది. సర్పంచులు ఎంపీటీసీలు యొక్క సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని అందరికీ అందుబాటులో ఉంటా అని హామీ ఇచ్చారు.