Sanatana Dharma: ఎలా పడితే అలా మాట్లాడితే గుడ్లు, నాలుక పీకేస్తాం: కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gajendra Singh Shekhawat warns The People Who are talking About Sanatana Dharma: ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన నాటి నుంచి అందుకు సంబంధించిన రగడ కొనసాగుతూనే ఉంది. ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు మాట్లాడితే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలైతే ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తాజాగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజస్థాన్ లోని బర్మర్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
‘మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారు. దీనిని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలను పీకేస్తాం. దానిని తక్కువ చేసి చూస్తే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారు రాజకీయంగా ఎదగలేరు’ అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఇక సనాతన వ్యాఖ్యలపైనే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్య సైతం స్పందించారు. సనాతన ధర్మాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. ఇలా మాట్లాడితే వారు హీరోలు కాబోరని ప్రకాష్ రాజ్, ఉదయనిధిని ఉద్దేశించి అన్నారు. వారు దేశానికి విలన్లు అవుతారన్నారు. డీఎంకే నేత ఉదయనిధి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ దానిని మలేరియా, డెంగ్యూ తో పోల్చిన సంగతి తెలిసిందే. వాటిని నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని మాట్లాడారు. అప్పటి నుంచి ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..