Site icon NTV Telugu

Minister Malla Reddy : ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష.. కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు వెళ్లిన మల్లారెడ్డి

Mallareddy

Mallareddy

నిన్న ఉదయం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లడు రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ క్రమంలో కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు మల్లారెడ్డి వెళ్లారు. సూరారం ఆసుపత్రి వద్దకు చేరుకున్న మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. నా కొడుకు ను కొట్టి ఉంటారని, నా కొడుకు భయ పెట్టారని ఆయన ఐటీ అధికారులపై ఆరోపణలు చేశారు.

Also Read :Yuvaraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గోవా సర్కార్ నోటీసులు

బీజేపీ రాజకీయ కక్ష్యతో నాపై నా బంధువుల పై ఐటీ రైడ్స్ చేయిస్తుందని, నా కొడుకు ఐటీ రైడ్స్ పేరుతో ఐటీ అధికారులు వేధించారన్నారు. నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆసుపత్రి పాలయ్యాడంటూ ఆయన ఆరోపించారు. కాలేజీలు పెట్టి సేవ చేస్తున్నాం… ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయట్లేదు.. క్యాసినోలు నడిపించట్లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కావాలని నాపై ఐటీ దాడులు చేస్తున్నారని, 200 మంది ఐటీ అధికారులతో మాపై దాడులు చేయించి భయపెడతారా? అని ఆయన మండిపడ్డారు. అయితే.. అయితే.. సూరరం హాస్పిటల్‌కి మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు వెళ్లారు.

 

Exit mobile version