Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి.. ప్రధానికి ఎర్రబెల్లి పోస్టు కార్డులు

Errabelli

Errabelli

Errabelli Dayakar Rao: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రధాని మోడీకి పోస్ట్‌ కార్డు రాశారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తన స్వహస్తాలతో రాసిన పోస్టు కార్డు మంత్రి ఇవాళ పోస్ట్ చేశారు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఒకవైపు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సమర్థవంతమైన పాలన ద్వారా చేనేతలకు ప్రోత్సాహకాలు ఇచ్చి కార్మికులను ఆదుకుంటుంటే.. మరోవైపు, కేంద్రం మాత్రం నడ్డి విరిచేలా 5 శాతం జీఎస్‌టీ విధించడం చాలా అన్యాయమన్నారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం చేనేత కార్మికులపై కక్ష కట్టిందన్నారు. దేశంలో కీలక వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధారపడిన రంగం చేనేత అని మంత్రి అన్నారు. అలాగే, భారతదేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా చేనేత రంగంపై విధించిన జీఎస్‌టీ ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

PM Narendra Modi: సరిహద్దులు భద్రంగా.. ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటేనే దేశం సురక్షితం

ఇటీవల చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్‌ కార్డు పంపిన సంగతి తెలిసిందే. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డులో కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ.. సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వదస్తూరీతో పోస్ట్ కార్డ్ రాశారు మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలతోపాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలన్నారు.

Exit mobile version