వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోంది అని కామెంట్స్ చేశారు. సమైఖ్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని అన్నారు. జనం కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే అంటూ పేర్కొన్నారు.
Also Read : Canada: “రన్నింగ్ చేస్తే తీవ్రమైన అలర్జీ”.. అరుదైన జబ్బులో బాధపడుతున్న మహిళ..
కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు, రైతు బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి పథకాలు దేశానికే దిక్సూచీలుగా మారాయి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అభివృద్ధి-సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది. తెలంగాణ పాలనను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ మంత్రి ఎర్రబెల్లి సూచించారు. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Priyanka Chopra: నా అండర్ వేర్ చూడాలని, వారికి చూపించమని డైరెక్టర్ వేధించాడు..
రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలోని బీజేపీ నిరుద్యోగులను మోసం చేసింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రజల మనిషి సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
