NTV Telugu Site icon

Dharmana Prasada Rao: మంత్రి ధర్మాన వార్నింగ్‌.. అలా చేస్తే బహిష్కరణే..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకులుగా ఉన్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. పార్టీలోనే కొనసాగుతూ వ్యతిరేకులుగా ఉన్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఇప్పటికే గుర్తించామని, ఏరివేత చర్యలు చేపడతామన్నారు.. వాలంటీర్లపై అప్రమత్తంగా ఉండాలని, పార్టీకి వారే చేటు తెస్తారని సూచించారు.. వైసీపీ నాయకులంతా సమిష్టిగా ఉన్నారని తెలిపిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయని కుటుంబాల గడప కూడా తొక్కనన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వెల్లడించారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇక, రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పెరిగిందనిచెప్పారు మంత్రి ధర్మాన.. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవాలని, పార్టీ పటిష్టతకు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. నాయకత్వ బాధ్యత నిర్వహించలేని నాయకులు స్వచ్ఛందంగా తప్పుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలని హితవు పలికారు. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల కంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం వినూత్నంగా చేశామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.