NTV Telugu Site icon

Dharmana Prasada Rao: మగాళ్ళపై మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

నిత్యం వార్తల్లో ఉంటూ.. సంచలన కామెంట్లు చేస్తుంటారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారన్నారు ధర్మాన. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమ‌పధకాలు అందిస్తున్నారు. జగన్ ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన‌ మూడు వేలు మరి అందవు. ఆడోళ్లకి ప్రాధాన్యత ఇచ్చేస్తుంది ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు.

Read Also: KVP Ramachandra Rao: రాహుల్‌ ని దేశద్రోహిగా చిత్రీకరించడం దారుణం

మీ‌ఇంటిలో ఉన్న మగోళ్లే అసలు విలన్లు. సినిమాకు , కల్లు తాగాలని , మందు తాగాలని మహిళలను డబ్బులు అడగాళ్సి వస్తుందని మగాళ్లు బాధపడుతున్నారన్నారు. 2019 సంవత్సరానికి ముందు అధికారం లేదు కనకనే జగన్‌ పథకాలు ఇవ్వలేకపోయారు. అధికారం అనే‌‌‌ కీ జగన్‌ వద్ద ఉంది కనుకనే సంపదను మహిళా సోదరీమణుల చేతులలో పెట్టాడు. అధికారంలేకపోతే జగన్ పథకాలు ఇవ్వలేరు. రాబోయే కాలంలో జగన్ కి అధికారం మరోమారు కట్టబెట్టాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read Also: Nidhhi Agerwal: మొన్న రష్మిక.. నేడు నిధి.. ఏం చేస్తున్నావయ్యా వేణుస్వామి