NTV Telugu Site icon

Dharmana Prasada Rao: 75 ఏళ్ల తర్వాత మార్పు వచ్చింది.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడింది..

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: 75 ఏళ్ల తర్వాత మార్పు వచ్చింది.. ఆ మార్పుతోనే ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ వచ్చిందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గతంలో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉండి ఏదో పని చేసామా లేదా అన్నట్టు ఉండేది.. ప్రజల్లో 75 సంవత్సరాలు తర్వాత మార్పు వచ్చింది.. ఆ మార్పే ఈ ప్రభుత్వ రాక అన్నారు.. ఈ ప్రభుత్వ రాకతో ఎన్ని మార్పులు వచ్చాయో అర్థం చేసుకోవాలి అన్నారు. యువత ఆలోచించాలి ఉద్యోగం రాకపోతే జగన్మోహన్ రెడ్డి కారణమా..? మెరిట్ ఉన్నవారికి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి యువత ఒక్కసారి గమనించండి. ఒక్క ఆరోపణ లేకుండా అవినీతి లేకుండా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. అవినీతి లేకుండా పారదర్శకం గా ప్రజలకు పథకాలు అందించాం. టిడిపి వాళ్ళు ఎవరైనా, చంద్రబాబు అయినా అవినీతి జరిగింది అని నిరూపించాగలరా..? సవాల్‌ చేశారు.

ప్రభుత్వం పై బురద జల్లాలి అనే రీతిలో ఏదో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ధరలు పెరిగాయి అంటున్నారు.. దేశం లో ఎక్కడ ధరలు పెరగలేదా? అని ప్రశ్నించారు ధర్మాన.. విద్యుత్ ధరలు పెరగడం వాస్తవం.. మనకన్నా తక్కువ విద్యుత్ చార్జీలు వుందా చూపండి. జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు విద్యుత్ ధరలు పెరుగుతాయి.. గ్యాస్ ధరలు పెరిగాయి ఓ మహిళ అడిగింది.. గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు కేంద్రం ప్రభుత్వం నిర్ణయిస్తుంది.. 2 లక్షలా 32 వెల కోట్ల రూపాయల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అందుకే కొనుగోలు పెరిగింది.. డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతున్నా.. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పను.. నిజాలు చెప్తా.. వ్యవసాయం చేయడం కోసమని జగన్ ఆ డబ్బులు ఇచ్చారు.. నాలుగున్నర సంవత్సరాల నుంచి రైతు భరోసా ఐదుసార్లు రైతులకు ఇప్పటి వరకు వేసాం.. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు.. కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చి రుణ మాఫీ చేశారు అని తెలిపారు.

మాట ఇస్తే మాట తప్పని సీఎం జగన్ అన్నారు ధర్మాన.. 4 వేల కోట్ల తో పోర్ట్ నిర్మాణం.. 800 కోట్లతో కిడ్నీ ఆసుపత్రి నిర్మించాం అన్నారు.. సినిమా నటులు వచ్చారు.. ఓవర్ యాక్షన్ చేశారు.. జగన్ వచ్చారు ఇక్కడ నీటిని శుద్ది చేస్తే కిడ్నీ వ్యాధులు తగ్గుతాయని తెలుసుకొని శుద్ధ జలాల కోసం కోట్లు ఖర్చుపెట్టారు.. ఒక మెట్టు జగన్ దిగి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ని కలిసి నేరెడ్ బ్యారేజ్ కోసం సహకరించమని కోరారు. ఆయన ఒకే చేశారని తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా శ్రీకాకుళం లో వంశధార నేరడి బ్యారేజ్ కోసం ప్రయత్నం చేసావా చంద్రబాబు..? అని నిలదీశారు. విశాఖపట్నం రాజధాని వస్తే శ్రీకాకుళంలో భూములు విలువ పెరుగుతుంది.. అక్కడ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.. అమరావతి రాజధాని అన్నారు.. చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నారు.. మద్రాసు, కర్నూలు, హైదరాబాదు ఎలా ఎన్నిసార్లు రాజధాని మార్చారు.. ఇప్పుడు అమరావతి అంటున్నారు.. విశాఖపట్నం ఎందుకు వద్దు..? అని నిలదీశారు. సినిమా నటులు, రాజకీయ నాయకులు హైద్రాబాద్ లో వుంటారు. ఎవ్వరూ ఆంధ్రలో వుండరు.. విశాఖపట్నం రాజధాని వద్దంటున్నారు. కానీ వ్యాపారాలు చేస్తారు అని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద విషయాలు గోప్యంగా ఉంచుతారు.. గుట్టు చప్పుడు కాకుండా అమరావతి ని ఓకే చేశారు.. శివరామకృష్ణ కమిషన్ కూడా చెప్పింది రాజధాని వికేంద్రీకరణ కావాలని. దానిని పక్కన పెట్టారు అని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.