Site icon NTV Telugu

Minister Dharmana Prasada Rao: ఒక్క ఛాన్స్ ఇవ్వండని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు..?

Darmana

Darmana

వైసీపీ ప్రభుత్వం ప్రజలందరిదని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. నేడు (సోమ‌వారం) నిమ్మాడ గ్రామం, ప‌రిస‌ర ప్రాంతాల్లో పర్యటించి ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉండి ఏ పని చేయలేదు… ఇప్పుడు బస్సు టికెట్టు ఇస్తాడట అంటూ చంద్రబాబు నాయుడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Ustad Bhagat Singh: కత్తులతో ఉస్తాద్ డైరెక్టర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?

రుణమాఫీ చేస్తానని చెప్పి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు ఇప్పుడు మల్లీ మాయమాటలు చెప్తున్నాడని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. తప్పు చేస్తే మాకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం.. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. విద్యుత్తు వినియోగం పెరిగింది.. కొనడానికి కరెంటు లేదు… అందుకే కోతలు అంటూ చంద్రబాబు చేసి అసత్య ప్రచారంపై మంత్రి విరుచుకుపడ్డాడు.

Read Also: Health Tips : కీరదోస ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోవాలి..

దేశంలో విద్యుత్తు ఉత్పత్తి తక్కువగా ఉంది.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్తు ధరలు తక్కువగా ఉన్నాయని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు.
రాజకీయం కోసం వాళ్లు ఏవో చెబుతారు.. జరిగిన వాస్తవాలు గమనిచండి అని మంత్రి తెలిపారు. మ‌న కళ్ళ ఎదుట జరుగుతున్న మార్పులను ప‌రిగ‌ణించి, వాటికి కార‌ణం అయిన వారికి మీరంతా సపోర్టుగా నిలవాలి అని ధర్మాన ప్రసాద్ రావు కోరారు. గ్రామీణ ప్రాంతాల పేద‌ల‌కు, పట్టణ ప్రాంతాల పేద‌ల‌కు వైద్య సేవ‌లు ఉచితంగా అందిస్తున్నాం.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version