NTV Telugu Site icon

Damodara Rajanarsimha : డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

Damodara Raja Narsmiha

Damodara Raja Narsmiha

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారుల పై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతానికి చర్యలు చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైనా (జోన్ – I నుండి – 5 గురు) జోన్ – II నుండి – 12 మంది) 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారుల పై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టిందన్నారు. ఎంతో బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశ నిర్దేశం చేశారు.