Site icon NTV Telugu

Damodara Rajanarsimha: ఆసుపత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులో తీసుకురావాలి..

Raja Narasimha

Raja Narasimha

వైద్యాశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్లో 2100 బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని అల్వాల్లో నిర్మిస్తున్న 1200 బెడ్స్ సామర్ధ్యం కలిగిన టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్బీనగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణ పనుల పురోగతితో పాటు ఎర్రమంజిల్లోని నిమ్స్ (NIMS) హాస్పిటల్ 2వేల బెడ్స్ సామర్ధ్యంతో నిర్మిస్తున్న విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

Read Also: CM Revanth: కరెంట్ కట్ చేస్తే సస్పెండే.. సీఎం వార్నింగ్

ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రుల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్అండ్బీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే తక్షణం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ నగరానికి మెరుగైన వైద్య సేవల కోసం వచ్చే రోగులకు అంధించే చికిత్సలపై టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. టెక్నికల్ కమిటీ సూచించిన విధంగా ఆయా ఆస్పత్రులలో స్పెషాలిటీ సేవలను, చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

Read Also: AP Election 2024: ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్..!

Exit mobile version