సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. తెలంగాణలోని 34 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు.
వైద్యారోగ్య శాఖ- EFLU మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విదేశాల్లో ఉద్యోగం కోసం జర్మన్, జపాన్ లాంగ్వేజ్ లలో నర్సింగ్ విద్యార్థులకు రెండేళ్ల శిక్షణ ఇవ్వనున్న ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజిస్ యూనివర్సిటీ.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. 34 జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం..
Also Read:Ambati Rambabu : కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలం
ప్రతి జిల్లాలో 20 బెడ్లతో ఈ సెంటర్ లు నడుస్తున్నాయి.. క్యాన్సర్ చాలా ప్రమాదకర వ్యాధి.. క్యాన్సర్ పై పోరాడిన నూరి దత్తాత్రేయని సలహాదారుగా నియమించాము.. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ఏర్పాటు చేయబోతున్నాం.. ప్రతి గ్రామంలో ఈ వాహనాలు వెళ్లి క్యాన్సర్ పరీక్షలు చేసి నిర్దారణ చేస్తాం.. ప్రస్తుతం 55 వేల క్యాన్సర్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.. వచ్చే ఈ ఏడాది ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.. EFLUతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నర్సింగ్ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.. విదేశాల్లో తెలంగాణ నర్సింగ్ విద్యార్థులు రాణించాలి అని ఆకాంక్షించారు.
