100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత వ్యవస్థలో తప్పులు జరిగాయని, వాటిని తాము సరిదిద్దుతామన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు.
Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీదారు కానేకాదు.. డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం!
‘గత వ్యవస్థలో తప్పులు జరిగాయి. వాటిని మేం సరిదిద్దుతాం. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది. ఎవరిని విమర్శించే వ్యక్తిత్వం నాది కాదు. ప్రజలు అసహనానికి గురి కాకుండా.. చూసుకునే బాధ్యత అధికారులదే. అధికారులు, నాయకులు పరస్పర సహకారంతో ముందుకు సాగి.. లబ్ధిదారులకు ప్రయోజనాలను అందిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి వుండదు, మానవతా కోణం మాత్రమే వుంటుంది. అధికారులు నిబద్ధతతో పని చేయండి, ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. రాబోయే పది రోజులు కష్టపడండి. అందరం కలిసి పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేద్దాం’ అని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో అన్నారు.