NTV Telugu Site icon

Botsa Satyanarayana: టీడీపీకి జవసత్వాలు లేవు.. జాకీలు, క్రేన్లతో లేపుతున్నారు

Botsa Satyanarayana

Botsa Satyanarayana

విజయనగరం జిల్లా రాజాం నియోకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసమావేశం లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ , ఎమ్మెల్యే కంబాల జోగులు.. వైసిపి సీనియర్ నేతలు టీడీపీని తూర్పారబట్టారు. టీడీపీకి జవసత్వాలు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీదే అధికారంలోకి వచ్చాం అన్నారు. రుణాలు మాఫీ అంటూ చంద్రబాబు మోసం చేసాడు. ఆయన చేసిన అప్పులన్నీ తీరుస్తానని జగన్ హామీ ఇచ్చారు.. ఇచ్చిన విధంగా తీరుస్తున్నాం అన్నారు మంత్రి బొత్స.

Read Also: GVL Vs Amarnath: మంత్రి అమర్నాథ్ సవాల్ కు ఎంపీ జీవీఎల్ సై

సైకిల్ పోవాలని.. చంద్రబాబు మనస్సులో మాటని దేవుడే మాట్లాడించాడు. టీడీపీ పరిస్థితి అయిపోయింది.. జవసత్వాలు లేవు . జాకీ లు, క్రేన్ లు పెట్టి లేపుతున్నారు టీడీపీని. రాష్ట్ర అభివృద్ధి కోసం మేం మూడు రాజదానులు అంటుంటే.. చంద్రబాబు అమరావతే అంటున్నారు. రాష్ట్ర సంపద 5 లక్షల కోట్లను పట్టుకెళ్ళి అమరావతిలో చుట్టాలు బంధువులు తాబేదార్లకు కట్ట బెట్టాలనుకుంటున్నారు. సిగ్గుండాలి కదా.. కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి కి. ఉత్తరాంధ్రలో ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటున్నారు అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: Chandrababu Naidu: కందుకూరు బాధితులకు చంద్రబాబు పరామర్శ