NTV Telugu Site icon

Audimulapu Suresh: పండుగల వేళ ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు: ఆదిమూలపు సురేష్

Audimulapu Suresh

Audimulapu Suresh

పండుగలు వస్తున్నాయని, ప్రజలను అస్సలు ఇబ్బందులు పెట్టోద్దని ఉద్యోగాలను ఉద్దేశించి ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రజలకు సేవలు అందించే మున్సిపల్ శాఖ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, చర్చలు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ర్యాడికల్ విధానంలో వెళితే సమస్యలు పెరుగుతాయన్నారు. నేడు ఏపీ మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి మహాసభ విశాఖలో జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.

మహాసభ సందర్భంగా సర్వీస్ రూల్స్ కు సంబంధించిన సమస్యలను మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ ముందు మున్సిపల్ ఉద్యోగులు పెట్టారు. జీవీఎంసీ సర్వీస్ రూల్స్ ఆధారంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11 ఆర్ధికేతర అంశాలపై పరిష్కారం చూపించాలని మంత్రులను మున్సిపల్ ఉద్యోగులు కోరారు. మహాసభ సభ అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు.

Also Read: Chandrababu Naidu: మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి ఇస్తాం: చంద్రబాబు

‘ప్రజలకు సేవలు అందించే మున్సిపల్ శాఖ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి. చర్చలు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాని ర్యాడికల్ విధానంలో వెళితే సమస్యలు పెరుగుతాయి. పండుగలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టోద్దు. సంక్రాంతి ముందే సమస్యల పరిష్కారం చూపిస్తాం. చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసేందుకు కొన్ని విధానాల రూపకల్పన జరగాలి. రాడికల్ గానా, రేషనల్ గానా అన్నది ఉద్యోగ సంఘాలు చర్చించుకోవాలి. రేషనల్ అయితే ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోంది’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.