NTV Telugu Site icon

Minister Atchannaidu: ప్రజల సహకారం లేకే శ్రీకాకుళం వెనుకబడింది.. మంత్రి ఆవేదన..!

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: శ్రీకాకుళంజిల్లా అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్నా , ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం అన్నారు మంత్రి అచ్చెంనాయుడు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే జెండాపట్టుకోని లేస్తున్నారు.. ఎక్కడ అభివృద్ది జరగుతుంది..? దీనిపై చర్చజరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగాలన్నా , పేదరికం పోవాలన్నా పారిశ్రామికీకరణ జరగాలన్నారు. పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తే తప్ప ఇంకో డబ్బై సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది. ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం, అభివృద్దికి ఆటంకం కలిగించాలని చూడటం మంచి విధానం కాదన్నారు. వెనుకబాటుతనం, తలసరి ఆదాయంపై చంద్రబాబు మాట్లాడితే చిన్నబోయానన్నారు. మమాత్మా జోతిరావ్ పూలే జయంతి సందర్బంగా 5 కోట్లతో నిర్మించిన బీసీ భవన్‌ను ప్రారంభించారు మంత్రి..

Read Also: Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ఐఎస్ఐ ప్రమేయం.. మేజర్ ఇక్బాల్, సమీర్‌ల పాత్ర..

శ్రీకాకుళంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తక్కువగా ఉంది.. తలసరి ఆదాయంలో 26వ స్థానంలో శ్రీకాకుళంజిల్లా గా ఉండటం చాలా బాధగా ఉంది అన్నారు అచ్చెన్నాయుడు.. వనరులు ఉన్నాయి.. కానీ, ఉద్యమాలతో అడ్డుకుంటున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ అంటే జెండాలు పట్టుకు బయలుదేరుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ అంటే వద్దంటున్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను , 2 సార్లు మంత్రి అయ్యా , పార్టీ అధ్యక్షుడుగా పనిచేశా.. నాకు పదవులపై అశలేదు. జిల్లా అభివృద్ధికి మనసా వాచా కర్మణా పని చేస్తాను.. పాజిటివ్ మైండ్ లేకపోతే ఇంకో 75 ఏళ్లు ఆయనా శ్రీకాకుళం అభివృద్ధి జరగదు అన్నారు.. ఏపీలో 60 శాతం బడుగులు ఉన్నారు. గతంలో ఎన్నికలలో ఓటు వేసే యంత్రాల్లా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతనే ఆర్ధిక, సామాజిక , రాజకీయ అవకాశాలు వచ్చాయి. బీసీల అభివృద్ధికి ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీనే దానికి ప్రధాన కారణంగా అభివర్ణించారు.. అయితే, బీసీలపై కక్ష కట్టిన పార్టీలు కూడా ఉన్నాయి.. కానీ, పదవులు శాశ్వతం కాదు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు..

Read Also: Vinesh Phogat: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ సర్కార్ బహుమానం.. ఎన్ని కోట్లంటే..!

ఆనాడు చంద్రన్న భీమా పథకం తీసుకు వచ్చాం. క్రీడ మంత్రిగా 175 నియోజకవర్గంల్లో స్టేడియాలు ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో బీసీ భవనాలు 5 కోట్లు చెప్పిన విడుదల చేసి నిర్మాణం చేశామని గుర్తుచేసుకున్నారు అచ్చెన్నాయుడు.. బీసీల కోసం ఆదరణ పథకంలో వున్న గోదాంలలో ఉన్న పరికరాలు కోట్ల రూపాయలు ఇచ్చాం. బీసీల మీద కక్షతో గత 5 సంవత్సరాలు వివక్ష చూపించి సాయం చేయలేదని విమర్శించారు.. అయితే, ఆదరణ పథకంలో ప్రతి లబ్ధిదారులకు అందజేస్తాం. శ్రీకాకుళం ప్రధాన కేంద్రం అభివృద్ధి చేయాలను కుంటున్నాం, సహకరించండి అని విజ్ఞప్తి చేశారు.. మార్కెట్ చూస్తే బాధగా ఉంది.. మున్సిపల్ కార్యాలయం పెచ్చులు ఊడిపోతుంది.. PP మోడల్ నిర్మించాలను కుంటున్నాను. వచ్చే ఐదేళ్లలో పట్టణం రూపు రేఖలు మారుస్తాం అని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు..