పోలవరం ప్రాజెక్టు.. ఏపీకి జీవనాడిగా చెప్పుకుంటున్నారు.. కానీ.. ఇది ఎప్పడుు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకొచ్చారు.. ఏదో హాడావుడిగా పనులు చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు డయాఫ్రం వాల్ నిర్మించడం వల్లే ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎన్టీవీ క్వశ్చన్ అవర్ లో మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. దీని వల్లే పోలవరం నిర్మాణం పూర్తి కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణం అన్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబువి తప్పుడు నిర్ణయాలు తీసుకన్నారు.. దాని వల్లే పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.
Read Also: Kishan reddy: దేశ భవిష్యత్ బాగుండాలంటే మోడీని గెలిపించాలి
ఇక, పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ 2019, 2020 సంవత్సరాల్లో వచ్చిన వరదలు కారణంగా పూర్తిగా దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. అందుకే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ సమస్య రాష్ట్ర పరిధిలోని కాదని సీడబ్ల్యుసీ, పీపీఏ, డీడీఆర్ సీల స్థాయిలో నిర్ణయించాల్సిందన్నారు. అయితే, సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని అంబటి రాంబాబు చెప్పారు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గతంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే కారణం అని మంత్రి అన్నారు. చంద్రబాబు ఆనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తినింది అని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.