పోలవరం విషయంలో టీడీపీది తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం జాప్యానికి కారణం జగన్ ప్రభుత్వం అని బ్రాండింగ్ చేయటానికి టీడీపీ, టీడీపీ మద్దతు మీడియా ప్రయత్నం చేస్తున్నదన్నారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గం చేసింది. కాఫర్ డ్యాం లేకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టిన ప్రబుద్ధులు టీడీపీ నేతలు. స్పిల్ వే నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు? రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందన్నారు మంత్రి అంబటి.
దాన్ని ఎలా పునరుద్ధరించాలా అని నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు సక్రమంగా ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ స్థాయిలో వరదలు వచ్చినా ఒక్క ప్రాణ నష్టం జరక్కుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఏమయ్యా రాంబాబు అంటున్నాడు దేవినేని ఉమ. మరోసారి ఇలా అంటే నేను కూడా ఒరేయ్…తురేయ్ అనాల్సి ఉంటుందన్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్నా…లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం జరక్కుండా కంటికి రెప్పలా కాపాడాం అన్నారు అంబటి.
వరదల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. టీడీపీ హయాంలోనే తప్పిదాలుఏ ఎక్కువగా జరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి, అప్పటి మంత్రి దేవినేని ఉమా లేదన్నారు. దొంగలు పట్ట ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా చంద్రబాబు వరద ప్రాంతాలకు ఇప్పుడు వెళ్లడం ఏంటని మండిపడ్డారు అంబటి. ప్రజల్ని రెచ్చగొట్టే కామెంట్లు చేయవద్దన్నారు. పుట్టగానే డయాఫ్రం వాల్ గురించి తెలియదన్నారు. మంత్రిని అయ్యాక అన్నీ తెలుసుకుంటున్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు పరిశీలించాకే కేంద్రం అనుమతి వచ్చిందన్నారు. తెలంగాణకు ఎలాంటి నష్టం రాదన్నారు.
నేను కాంట్రాక్టర్‌నా? ఇంజనీర్‌నా? తెలియటానికి. నాకు కామన్ సెన్స్ ఉంది… చిత్తశుద్ధి ఉంది. ఆరోగ్య శాఖ మంత్రికి ఆపరేషన్ చేయటం రావాలా?? ఎదుటి వాళ్ళను గేలి చేయాలని ప్రయత్నించటం దుర్మార్గం అన్నారు మంత్రి అంబటి.