ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గతంలో 29 ఎస్సీ నియోజకవర్గాలకు 28 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.. ఈసారి 29 స్దానాల్లో గెలుస్తాం.. చంద్రబాబు కొన్ని మీడియాలను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు వైసీపీ నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేల స్థానాలే చివరకు వారికి ఎన్నికల్లో లభించాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క పోటీ కూడా చేయలేని చంద్రబాబు ఈరోజు ఏదో ప్రచారం చేసి గెలవాలని చూస్తున్నారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Read Also: Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ గ్యాప్ లో వెకేషన్… సినిమా రిలీజైతే సెన్సేషనే
అక్కడి చెల్లని వాళ్లకు మరోక చోట సీట్లు అని చంద్రబాబు అంటున్నారు.. ఆయన పోటీ చేసే స్థానాన్ని చంద్రగిరి నుంచి కుప్పంకు ఎందుకు మారారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి జైలుకు కూడా వెళ్లిన చంద్రబాబు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైండ్ గేమ్ ఆడుతున్నారు.. కాంగ్రెస్ కోసం హైదరాబాద్ ను అభివృద్ది చేశానని చెప్పుకుని తన వర్గీయుల ద్వారా ప్రచారం చేసిన చంద్రబాబు ఆ సమీప ప్రాంతాల్లో ఎన్ని సీట్లు గెలిపించారో చెప్పాలి.. చంద్రబాబు చెప్పే మాటలకు పొంతన లేదు.. ఆయనది వృదా ప్రయాసే తప్ప మరోకటి కాదు అంటూ మంత్రి మండిపడ్డారు. చంద్రబాబుకు 175 స్థానాల్లో పోటీలో నిలిపేందుకు అభ్యర్దులు లేరు.. కొండేపి నియోజకవర్గాంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.