NTV Telugu Site icon

Minister Suresh Safe: మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం

Adimulapu Suresh

Adimulapu Suresh

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్.

Read Also: Chindepally Tension: తిరుపతి జిల్లా చిందేడులో ఉద్రిక్తత

ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Read Also:Ravi Shastri : విరాట్ కోహ్లీకి అంత సీన్ లేదు.. టెండూల్కర్ రికార్డ్ చేరుకోవడం కష్టం

Show comments