NTV Telugu Site icon

Minister Adimulapu Suresh: టీడీపీ కోటలు బీటలు వారుతున్నాయి..

Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh: జగనన్నే మన భవిష్యత్‌ పేరుతో సాగుతోన్న కార్యక్రమంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళే సాహసం చేయలేదు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాయా లేదా అని ప్రజలను అడిగిన ప్రభుత్వం లేదు.. ఒక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం వైఎస్‌ జన్‌ తప్ప అంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. రెండో వారం మెగా పీపుల్స్ సర్వే ప్రారంభిస్తున్నాం.. టీడీపీ కోటలు అనుకునే నియోజకవర్గాల్లో బీటలు వారే విధంగా కార్యక్రమం ఉంటుందన్నారు.. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్న ఆయన.. జీఎస్డీపీ పెరుగుదలలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.. జగన్ ప్రభుత్వ పారదర్శకంగా జవాబుదారితనంతో చేస్తున్న పాలన వల్లే ఈ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు ఆదిమూలపు సురేష్‌.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

మరోవైపు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. సంక్షేమ రథ సారధి జగన్ అని అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి రేటును కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్న ఆయన.. జగన్ ఇచ్చిన మాటను తప్పడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడన్నారు.. అందుకే ప్రజలు మా నమ్మకం జగన్ అంటున్నారు.. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. గతంలో రాజకీయ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓట్ బ్యాంకుగా చూసేవి.. కానీ, నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే నంటూ ప్రశంసలు కురిపించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ.

Show comments