ప్రకాశం జిల్లాలో మార్పులపై విజయసాయిరెడ్డి, బాలినేని కసరత్తు చేస్తున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశం ఉంది.. కొండెపిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరూ కలిసికట్టుగా పని చేస్తాం అని తీర్మానం చేశారు.. అధిష్టానం నిర్ణయం వెనుక అనేక కారణాలు, వ్యూహాలు ఉంటాయి.. గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో కొండెపి ఒక్క చోటే వైసీపీ ఓటమి పాలైంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి కొండెపిలో వైసీపీ జెండా ఎగరేయటం ఖాయం అయింది. 175 నియోజకవర్గాల్లో ఎవరైనా సరే సీఎం జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మలతో గెలవాల్సిందే అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం ఎందుకు మారారు.. ఎన్టీఆర్, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలి అని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
Read Also: Delhi Police : ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర పేలుడు.. అనుమానితులను గుర్తించిన పోలీసులు
అయితే, గత కొన్ని రోజులుగా వైసీపీలో ఎమ్మెల్యే, ఇన్ ఛార్జీల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. పార్టీలో మార్పుల సహజం అలాంటి వాటిపై టీడీపీ అనవసరమై రాద్ధంతం చేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీ 175 స్థానాల్లో విజయం సాధించాలంటే తప్పకుండా తగిన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.. మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ ఇలా చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.