Site icon NTV Telugu

MLA Hussain: “సాయంత్రం వరకు క్లారిటీ”.. సౌదీ బస్సు ప్రమాదంపై ఎంఐఎం ఎమ్మెల్యే కీలక ప్రకటన..

Hussain

Hussain

MLA Hussain: సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే తనకు కాల్ చేశాడన్నారు. మోహదీపట్నంలో బాధిత కుటుంబాలను కలిశాన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఈ రోజు ఉదయం 11 గంటలకు సౌదీ అరేబియాకు తమ పార్టీ తరఫున ఐదుగురిని పంపినట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వాళ్లు అక్కడికి చేరుకుంటారన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత క్లారిటీ వస్తుందని వెల్లడించారు.. మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉందా? లేదా అనే విషయంపై సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు.

READ MORE: CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. రూ. కోట్లల్లో సంపాదన..

సౌదీ రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు హైదరాబాదీలు సజీవదహనమయ్యారు.. మొదటి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.. మహమ్మద్ అబ్దుల్ షోయబ్ చికిత్స పొందుతుండగా.. అతడి తండ్రి మహమ్మద్ అబ్దుల్ కధీర్, గౌసియా బేగం మృత్యువాత పడ్డారు. షోయబ్ తాత మహమ్మద్ మౌలానా (గౌసియా ఫాదర్), బంధువులు రహీమ్ ఉనిషా, రెహమత్ బి, మహమ్మద్ మన్సూర్ వీరితో పాటు మరొకరు సజీవదహనయ్యారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో మరో కుటుంబానికి సంబంధించిన ఏడుగురు చనిపోయినట్టుగా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు..

Exit mobile version