T20 Cricket : పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ 2023కు భారత జట్టును పంపకూడదన్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ ఎందుకు ఆడుతుందన్నారు. భారత జట్టును పాకిస్తాన్ లో ఆడేందుకు పంపకూడదని నిర్ణయించుకున్నప్పుడు.. రేపు పాక్ తో మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు?
పాక్ తో ఆడక పోతే ఏమవుతుంది మహా అయితే రెండు వేల కోట్లు నష్టం జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై మ్యాచ్లో భారత్ గెలవాలనే నేను కోరుకుంటున్నాను, బ్రిటిష్ వారితో పోరాడిన వారు ఇక్కడే ఉండిపోయారు భయపడిన వారంతా పాకిస్తాన్ కు వెళ్లిపోయారు అంటూ ఒక్కసారి గతాన్ని గుర్తు చేశారు. పాక్ పేరు చెప్పి బీజేపీ రాజకీయాలు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులకు భయపడి సాంప్రదాయాలు వదులుకోవద్దని ముస్లిం సోదరులకు హితవు పలికారు, ముస్లిం మహిళలంతా హిజాబ్ ధరించాలని కోరారు.
Read Also: T20 World Cup: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. 15ఏళ్లలో తొలిసారి
బీసీసీఐ సెక్రటరీ జేషా.. భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లబోదని ప్రకటించడంతో భారత్ వర్సెస్ పాకిస్తాన్ అనే వివాదం చెలరేగింది. ఆసియా కప్ లో పాల్గొనేందుకు భారత్ పాకిస్తాన్ కు వెళ్లాలా వద్దా అనే అంశంపై హోం మంత్రత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
LIVE : Barrister @asadowaisi addresses Jalsa Rahmatul-Lil-Aalameen | Vikarabad | 2022#milad #Mawlid #prophetforall https://t.co/GVAKwlynyM
— AIMIM (@aimim_national) October 21, 2022