NTV Telugu Site icon

Milk Shake : మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఇది ఒక్కసారి చదివితే జన్మలో తాగరు..

Milk Shakes

Milk Shakes

మిల్క్ షేక్స్ ను ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తాగుతారు..ఆరోగ్యం, టేస్ట్‌ పరంగా ఇవి బెటర్ అని భావిస్తారు. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే టేస్ట్ బాగుంటుంది.. కానీ కొన్ని మిల్క్ షేక్స్ వల్ల ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.. అవును.. మీరు విన్నది అక్షరాల నిజమే.. మరో ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు.. అసలు విషయమేంటంటే..

ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఓ బర్గర్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనతో మిల్క్ షేక్ వల్ల ఆరోగ్యానికి హానీకరమా? అనే చర్చ జరుగుతోంది. మరి మిల్క్‌షేక్ తాగడం వల్ల ఆ ముగ్గురు ఎందుకు చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం..

వీరంతా తాగిన మిల్క్ షేక్ లో లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. లిస్టేరియోసిస్.. లిస్టేరియా మోనోసైటోజెన్స్ అని పిలువబడే బ్యాక్టీరియాతో కలిసి ఆహారాన్ని కలుషితం చేస్తుంది. దీన్ని తినడం వలన తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వస్తుంది. వాషింగ్టన్‌లోని టాకోమాలో ఫ్రూగల్స్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ విక్రయిస్తారు. అయితే, వీటిని యంత్రాల సాయంతో చేస్తారు.. వాటిని సరిగ్గా శుభ్రం చెయ్యక పోవడంతో ఈ బ్యాక్టీరియా వస్తుందని నిపుణులు చెబుతున్నారు..

లిస్టెరియా అనేది ఆహారం ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధిగా పరిగణించబడుతుంది. లిస్టెరియాతో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా చల్లని ఉష్ణోగ్రతలో కూడా జీవించగలదు. పరిశోధకులు రెస్టారెంట్‌లోని ఐస్‌క్రీమ్ మెషీన్‌లలో లిస్టెరియా బ్యాక్టీరియాను కనుగొన్నారు.. ప్రస్తుతం దీనివల్ల ఆరుగురు ఆసుపత్రి పాలై పోరాడుతున్నారు.. చూసారుగా ఇప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది..