Site icon NTV Telugu

Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. 16 మంది మృతి

Bangladesh

Bangladesh

వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో మిలిటరీ శిక్షణా విమానం కుప్పకూలింది. రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ భవనంపై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI కూలిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదం ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. జెట్ ప్రమాదం కారణంగా పాఠశాల ప్రాంగణం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ బంగ్లాదేశ్ వార్తాపత్రిక డైలీ స్టార్ పేర్కొంది.

Also Read:Malaika Arora : మండుటెండల్లో మలైకా అరోరా మత్తెక్కిస్తోందిగా

బంగ్లాదేశ్ సైన్యం తరపున ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) సోమవారం మధ్యాహ్నం విమానం కూలిపోయిందని తెలిపింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 BGI శిక్షణ విమానం ఉత్తరాలో కూలిపోయిందని తెలిపింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కానీ మృతుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.

Exit mobile version