Site icon NTV Telugu

China: పొరుగు దేశాలపై డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం.. తైవాన్ పై మిలిటరీ వేధింపులు

China Taiwan

China Taiwan

పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం డ్రాగన్ కంట్రీ చేసే ప్రయత్నాలు తీవ్ర తరం చేస్తుంది. ఈ క్రమంలో.. తైవాన్‌పై చైనా దేశ మిలిటరీ అధికారులు వేధింపులకు పాల్పడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్‌ వైపు పంపించి చైనా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. చైనా చర్యలను కవ్వింపుగా తైవాన్ రక్షణ శాఖ అభివర్ణిస్తోంది. చైనా ఇప్పటి వరకు పంపిన యుద్శ విమానాల్లో.. 40 యుద్ధ విమానాలు తైవాన్‌ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద దుందుడుకు చర్యగా తైవాన్‌ అధికారులు చెబుతున్నారు. యుద్ధ విమానాలతో పాటు తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తైవాన్ ప్రభుత్వం తెలిపింది.

Read Also: Big Breaking: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేబినెట్ ఆమోదం

మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని.. తైవాన్ కూడా చైనాలో భాగమేనని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు బీజింగ్‌ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి చేసే అవకాశం ఉంది.

Read Also: Health Bulletin: ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల.. ఆరా తీసిన సీఎం..

అయితే, తైవాన్‌కు సొంత ప్రభుత్వం, సైన్యం, రాజ్యాంగం ఉన్నప్పటికీ, డ్రాగన్ కంట్రీ మాత్రం ఆ దేశ ప్రభుత్వాన్ని తన అధినంలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. చైనా ఏకీకరణే లక్ష్యంగా ఆ దేశ ప్రభుత్వం వ్యూహాం రచిస్తుంది. చైనా ప్రావిన్స్ నుంచి తైవాన్ తాత్కాలికంగా విడిపోయిందని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. శాంతియుత మార్గాల ద్వారా లేదా అవసరమైతే బలవంతంగా అయినా చైనా నుంచి విడిపోయిన తైవాన్‌ను మళ్లీ కలుపుకుంటామని ఆదేశ అధినేతలు చెబుతున్నారు. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించొద్దని ఇతర దేశాలపై ఒత్తిడి చేయడం ద్వారా దౌత్యపరంగా తైవాన్‌ను ఒంటరి చేయాలని బీజింగ్ చూస్తోంది.

Exit mobile version